చేతులను తాళ్లతో కట్టేసుకుని లోకేశ్, బ్రాహ్మణి నిరసన... ట్రెండింగ్ లో 'న్యాయానికి సంకెళ్లు' హ్యాష్ ట్యాగ్

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నేడు న్యాయానికి సంకెళ్లు పేరిట టీడీపీ శ్రేణుల నిరసన
  • చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదించిన వైనం
  • హైదరాబాదులోని తమ నివాసంలో నిరసన తెలిపిన లోకేశ్, బ్రాహ్మణి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నేడు న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో పాల్గొన్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి హైదరాబాదులోని తమ నివాసంలో చేతులను తాళ్లతో కట్టేసుకుని నిరసన తెలిపారు. న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లని వారు నినదించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ఎలుగెత్తారు. 

కాగా, న్యాయానికి సంకెళ్లు హ్యాష్ ట్యాగ్  ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోందని టీడీపీ వెల్లడించింది. చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా న్యాయానికి సంకెళ్లు అంటూ నారా లోకేశ్ ఇచ్చిన పిలుపు మేరకు ట్విట్టర్ వేదికగా  #NyayanikiSankelluForCBN అనే హ్యాష్ టాగ్ తో వేల సంఖ్యలో ట్వీట్స్ వస్తున్నాయని వివరించింది. చంద్రబాబుకు నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని టీడీపీ పేర్కొంది.

Nyayaniki Sankellu
Nara Lokesh
Nara Brahmani
Chandrababu
Arrest
TDP

More Telugu News